మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 17: అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ పోస్టర్ ఆవిష్కరణ బుధవారం ఆ పార్టీ సభ్యులు నిర్వహించారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గడప గడపకు జనసేన పార్టీ నీ విస్తృత స్థాయిలో బలోపేతం చేసి రానున్న రోజుల్లో పార్టీని పూర్తిస్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళడమే ఈ పోస్టర్ ఆవష్కరణ ముఖ్య ఉద్దేశమని అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ డేగల రామచంద్రరావు తెలిపారు . గ్రామస్థాయి నుండి జనాల్లోకి గాజు గ్లాస్ గుర్తును తీసుకు వెళ్ళడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ వినోద్, బద్దిరెడ్డి రాజేష్, లింగిశెట్టి కుమార్ స్వామి, దామెర బాబి, రాజా, నాగు, మల్లం రామకృష్ణ, మంగా రవీంద్ర, ఉప్పల మల్లికార్జున, మల్లికార్జున రావు నందం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.