UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 డయాలసిస్ కేంద్రాలు సిద్ధం అందుబాటులోకి డయాలసిస్ సేవలు

  • డయాలసిస్ కేంద్రాలు సిద్ధం
  • అందుబాటులోకి డయాలసిస్ సేవలు
  • జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

మణుగూరు,ఇల్లందులలో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడు డయాలసిస్ కేంద్రాలు మంజూరు కాగా అందులో రెండు కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందులలో ప్రారంభించడానికి సిద్దం చేశామని అతి త్వరలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని కొత్తగూడెం ఆసుపత్రి నందు 5 మెషిన్లతో, ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం ఆసుపత్రి నందు 10 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఈ రెండు కేంద్రాలు సరిపోక చాలా మంది వ్యాధిగ్రస్తులు వంతులు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, నిరీక్షించే వారని చెప్పారు. వ్యాధి గ్రస్థులకు సకాలంలో డయాలసిస్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అదనంగా మూడు నూతన డయాలసిస్ కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రి మణుగూరు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఇల్లందు, సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేటలో ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ 50 లక్షల చొప్పున మొత్తం ఒక కోటి 50 లక్షలతో. మొత్తం మూడు నూతన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలతో వ్యాధి గ్రస్థులకు సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నూతన కేంద్రాలు ఏర్పాటు ద్వారా డయాలసిస్ రోగులు డయాలసిస్ కొరకు భద్రాచలం, కొత్తగూడెం ఆసుపత్రులకు సుదూరం ప్రయాణం చేయకుండా స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుతో వ్యాధి గ్రస్థులకు వ్యయ ప్రయాసల భారం తగ్గనున్నదని ఆయన చెప్పారు. ఈ నెల చివరి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వారావుపేట లో కూడా డయాలసిస్ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !