మన్యంన్యూస్,ఇల్లందు:ఐఎన్ టియుసి మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిహెచ్ రాజమల్లు పన్నెండవ వర్ధంతిని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి జనరల్ సెక్రెటరీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డేనియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ఐఎన్టీయుసీ నేత దివంగత రాజమల్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… రాజమల్లు కాంగ్రెస్ పార్టీ కోసం, ఐఎన్టియుసి కార్మిక నాయకుడిగా విశేష సేవలందించారని తెలిపారు. కార్మికుల పక్షాన అనేక వారి సమస్యల పరిష్కారం దిశగా పార్టీ, యూనియన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టి పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఒంటి చేత్తో ఎంతోమంది వార్డ్ కౌన్సిలర్ గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఎంతోమందిని తయారు చేసినటువంటి నాయకుడు సిహెచ్ రాజమల్లు అని, ఇల్లందులో ఎమ్మెల్యే అభ్యర్దులు ఆయన మద్దతు కోసం ఎదురుచూసే వారని, అంతటి క్రియాశీలక పాత్ర పోషించిన రాజమల్లు నేడు మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అప్పట్లో సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ హవా నడుస్తున్న రోజుల్లో ఒంటరిగా వారితో పోరాడి ధీటుగా నిలబడిన వ్యక్తి రాజమళ్లు అని పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉంది అంటే ఆనాడు రాజమల్లు వేసిన పునాదులే అని ఆయన సేవలను గొప్పగా అభివర్ణించారు. రాజమల్లు మన మధ్య లేకపోయినా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లి రాబోయేరోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరొకసారి గెలిపించుకుందామని రామ్రెడ్డి గోపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బ్రాంచి ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు లింగాల జగన్నాథం, మండల అధ్యక్షులు పులి సైదులు, కామేపల్లి మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, కామేపల్లి జడ్పిటిసి ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
