UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 ఆ 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు అడ్డుకోలేని గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

  • ఆ 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు
  • అడ్డుకోలేని గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
  • ఆదివాసి గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 బీసీ కులాలను షెడ్యూలు తెగలు ఎస్టీ జాబితాలో కలిపే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని, లేదా 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అశ్వారావుపేట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పాయం దుర్గారావు మాట్లాడుతూ భారతదేశ మూలవాసులైన ఆదివాసులు సాంస్కృతి సంప్రదాయాలను చరిత్రను కాపాడుతున్న ఆదివాసి సమాజ మనుగడను దెబ్బతీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల జనాభా కలిగిన 11 బీసీ కులాలైన వాల్మీకి, బోయ, కైత లంబాడా, పెద్ద బోయ, బెధర, కేరతక, నీ సారి, తలయారి, చుండు, వాళ్లు, బాగ్ మధుర, చామర్ అను బిసి ఎస్సి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, కొన్ని బీసీ కులాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాయని ఎస్టీ జాబితాలో చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంచార కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని, గిరిజనులపై అత్యంత లోతుగా అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్ అదే అభిప్రాయాన్ని తెలియజేశారని, 30 లక్షల జనాభా కలిగిన బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లకు దూరమై సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం కనుమరుగై అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆదివాసీల మనుగడ లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా అసెంబ్లీ తీర్మానం చేస్తే 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు నోరు మెదపకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయారని వారు ప్రశ్నించారు. ఆదివాసి గిరిజన సమాజాన్ని రక్షించాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని, లేదా సాధ్యం కాకపోతే ఆదివాసీ గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తున్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని తెలంగాణ ఆదివాసి జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఊకే ముత్తయ్య, సోడెం ధర్మరాజు, జెట్టి లక్ష్మణరావు, విజయ్ కుమార్, కొవాసి స్వామి, పూనెం వెంకటస్వామి, సూర్యనారాయణ రావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రవీణ్, రమేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !