- భారతీయ ప్రామాణిక సంస్థ ప్రమాణాలపై..
- ప్రజలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి
- జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రజల దైనందిన జీవితంలో వినియోగగించు
వస్తువులపై భారతీయ ప్రామాణిక సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాలపై ప్రజలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విభాగం భారతదేశంలో వస్తు ఉత్పత్తి వినియోగానికి సంబంధించి పాటించవలసిన ప్రమాణాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.భారత ప్రామాణిక సంస్థ సర్టిఫికేషన్ దాని ప్రాముఖ్యత, ఆవశ్యకత వివరిస్తూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ, పరిశ్రమలు వంటి వివిధ రంగాలలో తయారయ్యే వస్తు విభాగాలకు బీఐఎస్ జారీచేయు నాణ్యతా ప్రమాణాల కోడ్స్ గురించి వివరించారు. బంగారం, వెండి నాణ్యతా ప్రమాణాల హాల్ మార్క్ గురించి బి ఐ ఎస్ జాయింట్ డైరెక్టర్ సుజాత వివరించారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో 21,675 ఉత్పత్తులను బీఐఎస్ నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. అలాగే దేశ వ్యాప్తంగా 1107 ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేయగా, తప్పనిసరి సర్టిఫికేషన్ కింద 459 ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. వస్తు తయారికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు 40 వేల లైసెన్సు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థల
అను సంధానంతో బీఐఎస్ దేశంలో వివిధ రంగాలలో దిగుమతి అయ్యే వస్తువులు, పరికరాలకు నాణ్యతా ప్రమాణాలకు అనుసంధానంగా పనిచేస్తుందన్నారు. బిఐఎస్ ప్రమాణాల కనుగుణంగా వివిధ వస్తు ఉత్పత్తిదారులు లైసెన్సులు మంజూరుకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకునే సౌలభ్యం బిఐఎస్ కల్పించిందని చెప్పారు. ధరఖాస్తు చేసుకున్న 30 రోజులలోగా లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని, అయితే నిర్దిష్ట కాలానికి రెన్యువల్ చేయించుకోవలసిన అవసరం ఉంటుందని తెలిపారు. బిఐఎస్ లైసెన్సు లేకుండా వస్తు ఉత్పత్తులు తయారు చేయకూడదని, వివిధ వస్తువులపై ప్రమాణాలు పాటించని తయారీదారుల ఉత్పత్తులు సీజ్ చేయడంతో పాటు జరిమానా, జైలు శిక్షలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఏదేని సలహాలు, సందేహాలు కొరకు ప్రజలు 7382492833, 7386430420 నంబర్లు కు కాల్ చేయొచ్చునని చెప్పారు. బి ఐ ఎస్ సిబ్బంది కృష్ణ వీర్ వర్మ,
ఏ అనూప్ కుమార్ లు వస్తు ఉత్పతి, వినియోగానికి సంబంధించి పాటించాల్సిన ప్రమాణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.