UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 మంచి మనసున్నోడు మనోహర్ బాబు

  • మంచి మనసున్నోడు మనోహర్ బాబు
  • భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ పదిలం
  • బీఆర్ఎస్ నాయకులు సోమరాజు మనోహర్ అకాల
  • మరణం.. ఎంతో బాధాకరం
  • శోక సంద్రమైన రేగళ్ల గ్రామం.. పలువురు నేతలు ఘన నివాళులు

 

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఎన్నో ఏళ్ల తరబడి ఏజెన్సీ గ్రామాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని గిరిజనలకు గిరిజన నేతలకు ఆదర్శప్రాయుడుగా నిలిచి వారి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమరాజు మనోహర్ అకాల మృతి ఎంతో బాధాకరమని పలువురు పార్టీ నేతలు అభివర్ణించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని సోమరాజు మనోహర్ స్వగ్రామం మైన రేగళ్ల గ్రామంలో సోమరాజు మనోహర్ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ పార్టీలకు చెందిన నేతలు అనేక ప్రాంతాల నుంచి ఏజెన్సీ లోని గిరిజనులు గిరిజనేతరులు వేలాదిమందిగా తరలివచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సోమరాజు మనోహర్ అకాల మరణం జీన్నించుకోలేని ఏజెన్సీ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు రేగళ్ల గ్రామం శోకసంద్రమైంది. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో మనోహర్ రాజకీయ జీవితం ఎంతో అంచలంచెలుగా ఎదగడమే కాకుండా అనేక పార్టీలలో కీలక పాత్ర పోషించి నేతల గెలుపోవటములకు ప్రధాన కారకుడుగా నిలవడం లో ఆయన ముఖ్యుడు. గ్రామంలోని అనేక భూములను నిరుపేద గిరిజనులకు దారా దత్తం చేసిన ఘనత ఆయనకే దక్కింది. మనోహర్ అంత్యక్రియలో పాల్గొన్న కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లా కార్యదర్శి ఎస్కె అన్వర్ పాషా, పాల్గొని ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సోమరాజు మనోహర్ పార్టీలకు అతీతంగా ఎన్నో సేవలు చేశారని ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆయన ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలుస్తూ ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్తగూడెం మండల వైస్ ఎంపీపీగా కూడా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన సేవలను అందించారన్నారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరంగా నిలిచిపోతాయి అన్నారు. అనంతరం సోమరాజు మనోహర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !