మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు పట్టణంలోని అయిత ఫంక్షన్ హాల్ నందు బుధవారం నిర్వహించిన ఊసకోయల రాజేశ్వరరావు-రజిత దంపతుల కుమారుని వివాహ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మెన్ కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వధూవరులు అఖిల్ కుమార్-మేఘనలను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారివెంట నాయకులు బోళ్ళ సూర్యం, చిల్ల శ్రీనివాసరావు, రావూరి సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.