మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ సీనియర్ నాయకులు, విద్యానగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖులు, విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతి ఉప సర్పంచి భర్త వనమా పిచ్చయ్య (57) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, సర్పంచ్ బానోత్ గోవిందు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫోన్లో పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వుమ్మడి చుంచుపల్లి గ్రామపంచాయతీలో పార్టీ అభివృద్ధికి యెనలేని కృషిచేశారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించిన పిచ్చయ్య మృతి ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని అన్నారు.