మన్యం న్యూస్ ఏటూరు నాగారం
గిరిజన దర్బారులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశపు మందిరంలో ప్రాజెక్ట్ అధికారి అంకిత్ గిరిజన దర్బార్ నిర్వహించారు.గిరిజన దర్బారులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.వాజేడు మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన మడే కవిత వాజేడు లేక వెంకటాపురం లోని ఎం సి హెచ్ స్టాఫ్ నర్స్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ముద్దబోయిన రవి ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏజెన్సీ మండలాలలో నూతన అక్రమ నిర్మాణం కట్టడాలను తొలగించాలని దరఖాస్తు చేశారు.ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పులిశే బాలకృష్ణ ఏటూరు నాగారం మండల పరిధిలోని ఆకులవారి ఘనపూర్ లో బాలికల హాస్టల్ లో కోతుల బెడద ఎక్కువ ఉన్నందున సోలార్ ఫెన్సింగ్ మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. వెంకటాపురం మండలం టేకుల బోరు గ్రామానికి చెందిన కాక గంగాభవాని ఐటీడీఏ ఏటూరు నాగారం పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో సిఆర్ టి గా నియమించాలని దరఖాస్తు చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 14 మంది సి ఆర్ టి ఉద్యోగులకు స్వంత జిల్లాకు బదిలీ చేయుటకు దరఖాస్తు చేసుకున్నారు. మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన పవన్ సింగ్ ఆశ్రమ పాఠశాలలో లేదా కళాశాలలో పి ఈ టి గా నియమించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఏటూరు నాగారం మండల రొయ్యూరు గ్రామానికి చెందిన అల్లెం చొక్కా రావు రొయ్యూరు, శంకరాజు పల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేశారు.కొత్తగూడ మండలం గుంజేడు గ్రామానికి చెందిన బుర్కా నిషా పటేల్ గోవిందపురం బాలికల మినీ గురుకులం పాఠశాలలో ఒకటవ తరగతి అడ్మిషన్ ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాజేడు మండలం దూలాపురం గ్రామ సర్పంచ్ కోరం సాంబయ్య దూలాపురం గ్రామంలో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేశారు.ఈ గిరిజన దర్బారులో ఏవో దామోదర స్వామి,ఎస్ ఓ రాజ్ కుమార్, ఈఈ హేమలత,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
