మన్యం న్యూస్ కరకగూడెం: యువత మత్తు వేసనాలు,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజారామ్ అన్నారు.అయన సోమవారం మండల పరిధిలోని పద్మపూరం గ్రామపంచాయతిలోని నిలద్రిపేట వలస ఆదివాసి గ్రామాన్ని సందర్శించారు. సందర్భంగా ఆయన అ గ్రాస్తులతో మాట్లాడుతూ యవత చెడు,మత్తు అలువాట్లకు, దూరంగా ఉండాలని తెలిపారు. యువత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవడానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. తమ సమయాన్ని వృధా చేయకుండా మోసపూరిత వ్యక్తులతో చేతులు కలపకుండా ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల మక్కువ సుపాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
