మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి తమ డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రి కి పంపవలసిందిగా జిల్లా కలెక్టర్ అనుదీపును కోరారు. వారి డిమాండ్లలో అతి ముఖ్యమైనవి. వైద్య సహాయానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్టంగా అమలుపర చాలని ఒకటవ పిఆర్సి కనుగుణంగా పెన్షనర్లమూలవేతనం నుంచి ఒక పర్సెంట్ వసూలు చేసి ఈ స్కీమును పూర్తిస్థాయిలో అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల కమిటేషన్ 15 సంవత్సరములకు బదులుగా 12 సంవత్సరాల కు కుదించాలని .మూడు- రెండో పి ఆర్ సి 1 7, 2023 నుంచి అమలుపరచాలని. అంతవరకు ఐ ఆర్ చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న రెండు డి ఆర్ లను చెల్లించాలని.నెలల తరబడి పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు , ప్రతినెల మొదటి తేదీనే పెన్షన్ చెల్లించాలన్నారు .ఇంకా ఇతర డిమాండ్లు కలిపి మొత్తం పది డిమాండ్లతోకూడిన వినతిపత్రం ముఖ్యమంత్రి కి పంపించవలసిందిగా కలెక్టర్ ను కోరారు.