అన్ని పనులు అధికారులే చేయరు!
కొన్నిసార్లు మనం కల్పించుకోవాలి!
రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను తొలగించిన రేగా సైన్యం.
మన్యం న్యూస్, పినపాక:
ఏడూళ్ళ బయ్యారం- తాడ్వాయి ప్రధాన రహదారి పినపాక మండలం భూపాలపట్నం గ్రామం వద్ద ఒక వృక్షానికి సంబంధించిన కొమ్మ ప్రధాన రహదారిపై విరిగిపడింది. అనేకమంది వాహనదారులు మాకేం పట్టదు అన్నట్టుగా వెళుతున్నారే తప్ప కాస్త వాటిని తొలగించాలనే ఆలోచన మాత్రం లేదు. అదే సమయంలో అటుగా వెళుతున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా అభిమానులు కొత్త దామోదర్ గౌడ్, కూనారపు రాము, బండ మనోజ్ రెడ్డి లు తమవంతుగా తలో చేయి వేసి చెట్టుకొమ్మలను తొలగించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి పనికి అధికారులు వచ్చి పరిష్కారం చూపలేరని, కొన్ని సందర్భాలలో మనం వాటిని పరిష్కరించాలని అన్నారు. వారు చేసిన ఈ పని పట్ల పలువురు వాహనదారులు, గ్రామస్తులు కొనియాడారు.