ఐదేళ్ల పాటు రాచి రంపాన పెట్టి చివరికి ఎన్నికల హామీగా కాస్త డబ్బులు పంచితే చాలని ఓట్ల కుప్పేనని జగన్ రెడ్డిఆశ పడుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు ..
ఏం చేయాలా అని ఆలోచించి. వాలంటీర్లకు జీతాలు పెంచడం. వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలు చేయడం వంటి స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్నారు.
వాలంటీర్లు గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేశారు. అప్పట్లో రూపాయి కూడా పెంచనని.. మీరు ఉద్యోగులు కాదు. సేవ చేస్తున్నారని వాదించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు వారు కూడా ఓట్లేస్తారో లేదోనన్న భయం వచ్చిందేమో కానీ జీతం పదివేలు ఇస్తానంటూ బేరం చేసుకుంటున్నారు. రూ. పదివేలు ఇచ్చేందుకు గవర్నమెంట్ వద్ద డబ్బుల్లేవు. అందుకే ఎన్నికల హామీగా ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలు చేయాలని అనుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు పెన్షన్ మూడు వేలు చేస్తానన్న జగన్ రెడ్డి. నాలుగున్నరేళ్లుగా . పెంచుకుంటూ వస్తూ.. ఇప్పుడు 2750 దగ్గరకు వచ్చారు.
ఎన్నికలకు వెళ్లే ముందు మూడు వేలు చేస్తారు. కానీ నాలుగు వేలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. టీడీపీ ఎలాగూ నాలుగు వేల హామీ ఇస్తుంది కాబట్టి.. తాము ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఆ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తే. ఎలా ఉంటుదా అని ఆలోచిస్తున్నారు. అయితే. పెంచుకుంటూ పోతామని. చేసిన మోసం ఇప్పటికీ అవ్వాతాతల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది.
జగన్ రెడ్డి ఎలాంటి ఎన్నికల హామీలు ప్రకటించినా .. జనం .. ఆ ఏముంది.. అప్పులు లేకపోతే.. ఆస్తులు తాకపట్టు పెట్టి తెస్తారు. ఇదంతా మా నెత్తి మీదే కదా పడేది.. అనే స్థితికి చేరుకున్నారు. దేశంలోనే అత్య.ధిక పన్నుల భారం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉంది. ప్రజల జీవనప్రమాణాలు దిగజారిపోతున్నాయి.