పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- సాయి తేజ్ (Sai Teju) లు కలిసి నటించిన బ్రో (BRO) మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సముద్రఖని డైరెక్షన్లో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కాకపోతే కలెక్షన్ల విషయంలో వెనుకపడింది. మొదటి రెండు, మూడు రోజులు గట్టిగానే రాబట్టినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి.
ప్రస్తుతం థియేటర్స్ లలో సందడి చేస్తున్న ఈ మూవీ..ఈ నెల 25 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో మరో ప్రధాన హీరోగా నటించాడు. తండ్రి అకాల మరణంతో తమ కంపెనీ బాధ్యతలు చేపట్టిన సాయిధరమ్.. పూర్తి సమయాన్ని కంపెనీ కోసమే కేటాయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ కోసం సరిగ్గా టైం కేటాయించడు. అలాంటి సందర్భంలో ఓ పెద్ద యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోతాడు.
అనంతరం అతను ఆత్మరూపంలో పవన్‌కల్యాణ్ కలుసుకుంటాడు. తాను జీవితంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించడం భావ్యం కాదని పవన్ కళ్యాణ్‌ను సాయితేజ్ కోరతాడు. దీంతో సాయితేజ్ అనుకున్న పనులు పూర్తి చేయడానికి కాలం అతనికి 90 రోజుల సమయాన్ని ఇస్తాడు. కాలం దయతో రెండో జీవితాన్ని పొందిన సాయితేజ్ తన బాధ్యతలన్నింటిని ఎలా పూర్తి చేశాడు? ఈ క్రమంలో అతను తెలుసుకున్న జీవిత సత్యమేమిటన్నదే మిగతా చిత్ర కథ. తొలుత ఈ సినిమాను పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది.