మన్యం న్యూస్,ఇల్లందు:తెలంగాణా ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 16,17,18 వార్డుల నందు గడపడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరం ప్రజలతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటం తధ్యమని, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిల సారథ్యంలో ఆడబిడ్డలకు ఐదువందల రూపాయలకే వంటగ్యాస్, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం, సొంతింటి కల సాకారానికి ఐదులక్షల రూపాయలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత కార్మికులు, డయాలసిస్, ఎయీడ్స్, పైలెరియా, బాధితులకు నెలకు నాలుగువేల రూపాయల ఫింక్షన్ వంటి కార్యక్రమాలను గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యదల్లపల్లి అనసూర్య, మండల అధ్యక్షులు పులి సైదులు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మైనారిటీ అధ్యక్షులు మసూద్, మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న , ఎస్సీసెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీను, బీసీ సెల్ అధ్యక్షులు శంకర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వీరూ, సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, జీవీ భద్రం, ఐజాక్, సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, కల్తీ పద్మ, ఎంపీటీసీలు మండలరాము, పూనెం సురేందర్, ముక్తి కృష్ణ, తాటి బిక్షం, ఆముదాల ప్రసాద్, గుగ్లోత్ నాగార్జున, కాకాటి భార్గవ్, ఊరుగోండ ధనుంజయ్, బానోత్ శారద, సదానందం, రావూరి సతీష్, ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.