UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 రేసుకి రేగా రెడీ.

రేసుకి రేగా రెడీ.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబురాలు.
రేగాని భుజం పై పల్లకి ఎత్తిన అభిమానం.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్: మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి జాబితాలో టికెట్ ప్రకటించిన నేపథ్యంలో పిఎసిఎస్ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస రావు,చల కోటిపూర్ణ చందర్, గొనేల నాని ,ఇతర ముఖ్య నాయకులు భుజంపై పల్లకి ఎత్తి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా బూర్గంపహాడ్ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టపాసులు కాల్చి డప్పుల మోతలతో నృత్యాలు చేసారు.సంబరాలు జరుపుతున్న పార్టీ ప్రజా ప్రతినిధులతో రేగా నృత్యాలు చేశారు.అభిమానులు జై కెసీఆర్,జై రేగా,జై బిఆర్ఎస్ అంటు నినాదాలు చేస్తూ రేగా నీ చేతుల పై పల్లకి కట్టి అభిమానం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పిఎసిఏఎస్ చైర్మన్ బికసాని శ్రీనివాసరావు,జిల్లా బిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మండల యూత్ ప్రసిడెంట్ గోనేల నాని,నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు చల్లకోటి పూర్ణ,ముఖ్య నాయకులు తోకల సతీష్,కొనకంచి శ్రీను,చుక్కపల్లి బాలాజీ,సాధిక్ పాష,ఖాదర్,చైతన్య రెడ్డి,గంగరాజు యాదవ్,సాయి బాబా,మందా ప్రసాద్,గుల్ మహ్మద్ పలువురు సర్పంచులు,ప్రజాప్రతినిధులు మండల నాయకులు పాల్గొన్నారు.
రేసుకి రేగా రెడీ.
ముఖ్యమంత్రి సిట్టింగ్ లో ఉన్న రేగాకి టికెట్ ఇవ్వడంతో రేసుకి రెడీ అంటున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ పినపాక నియోజకవర్గం మొత్తంగా ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం లో అటవీ ప్రాంతంతో కూడుకున్న పోడు భూములు ఎక్కువగా ఉంటాయి,పోడు వ్యవసాయం మీద ఆధారపడి వందల,వేలాది గిరిజన కుటుంబాలు జీవిస్తున్నప్పటికి,అడవుల ఆధారంగా జీవించే గిరిజనులకు పోడు భూములే ఆధారం అందుకే వారు ఈ భూముల కోసం ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై సైతం వీరు ప్రభావం చూపిస్తుంటారు.ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోడు భూముల సమస్యలను ఎన్నికల అస్త్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు ముందుకు వెళ్ళుతుంటాయి అని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసే రేగా గత ఎన్నికల్లో కుటమి నుండి గెలుపొంది గిరిజన రైతుల పొడుభుముల పట్టాల కోసం కంకణం కట్టుకొని కూటమిలో కొనసాగితే పట్టాలు లభించే పరిస్థితులు లేవు అని,గులాబీ తీర్థం పుచ్చుకొని పెద్ద సారు వద్ద పదే,పదే పోడు ప్రస్తావన తెస్తూనే ఉండే వారాట,ఇగ రానున్న ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ నుంచి రేగాకాంతరావు పోటీ చేయనున్నట్టు పలు మార్లు,పలు సందర్భాల్లో,సభల్లో రేగా ముక్తకంఠంతో చెప్పుకుంటు వస్తునే ఉన్నారు.రాష్ట్ర గులాబీ బాస్ కి రేగా పై ఉన్న అపార నమ్మకం మాత్రం అంతా ఇంతా కాదు కొద్దీ నెలల క్రితం రేగా కాంతరావు నీ బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు 100 కోట్ల ఆఫర్ ఇవ్వడంతో దానికి రేగా నో చెప్పడంతో విషయం తెలుసుకున్న పెద్ద సారు రేగానీ అభినందించి వారి యొక్క నియోజకవర్గానికి 100 కోట్ల అభివృద్ధి నిధులను రేగాకి బహుమతిగా ఇచ్చారు,అంతే కాకుండా 2023 లో పోడు రైతాంగానికి పాసు పుస్తకాలు సైతం పంపిణీ చేయడంతో,దీంతో నియోజకవర్గం ఎంటి రాష్ట్ర,దేశ ప్రజల్లో రేగా కి వచ్చిన పేరు,ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !