మన్యం న్యూస్ ,చర్ల:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థి తెల్లం వెంకట్రావు పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చర్ల మండలం బి ఆర్ యస్ యువ నాయకులు అయినటువంటి మాజీ చర్ల మండలం ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, యూత్ లీడర్స్ అయినటువంటి బోళ్ల వినోద్, రామగిరి అరుణ్,పవన్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భద్రాచలంలోనీ వెంకట్రావు నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు పూల వినోద్ మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, యువతీ యువకులు తెల్లం వెంకట్రావుకు పూర్తిమద్దతు ఇస్తామని అన్నారు.