UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ప్రజానాయకురాలు హరిప్రియకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

 

సంబరాల్లో ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

ఇల్లందు గడ్డ హరిప్రియ నాయక్ అడ్డా: జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్ మన్యం న్యూస్,ఇల్లందు:సంవత్సరాంతం చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలో భాగంగా సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కెసిఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి విడత జాబితాలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఖరారు చేసిన సందర్భంగా సోమవారం నాడు ఇల్లందు పట్టణంలో ఉద్యమ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీ పార్టీశ్రేణులతో కలిసి పట్టణంలో పలుచోట్ల బాణాసంచా కాల్చారు. గులాబీరంగు జల్లుకొని ఒకరికొకరు పరస్పరం స్వీట్లు తినిపించుకొని హరిప్రియ నాయక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణ ప్రజలకు, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా ఉద్యమనాయకులు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ..ఇల్లందు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ది చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆశీర్వాదంతో
హరిప్రియ నాయక్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో ప్రజాశీర్వాదం పొంది అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అవినీతిపరులు, స్వార్థ రాజకీయాలు చేసేవారి పాచికలు పారలేదని, రానున్న ఎన్నికల్లో అటువంటి నాయకులకు రాజకీయ సన్యాసం తథ్యమని, ఇల్లందు గడ్డ హరిప్రియ నాయక్ అడ్డా అని దిండిగల రాజేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పాషా, పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేష్, మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గండ్రాతి చంద్రావతి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్, ఉద్యమనాయకులు సిలివేరి సత్యనారాయణ, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్, డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు, మహిళా నాయకురాళ్లు, యూత్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !