ఎమ్మెల్యే మెచ్చాకు శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 22: అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా మంగళవారం దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్న గూడెం గ్రామంలో మెచ్చా స్వగృహంలో మెచ్చాని అశ్వరావుపేట మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువా తో సన్మానించి మెమొంటో అందజేశారు. అనంతరం ఇటీవలే ముస్లిం మైనార్టీ కి లక్ష రూపాయలు లోన్ మొదటి విడత కొత్తగూడెంలో కలెక్టర్ మంజూరు చేసిన ఆరుగురు చెక్కులను ఎమ్మెల్యే మెచ్చా చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యే మెచ్చా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసీ వచ్చే ఎన్నికలలో మెచ్చాకె ఓటు వేసి గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, డిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు, బిర్రం వెంకటేశ్వరరావు, చందా లక్ష్మి, నరసయ్య, శెట్టిపల్లి రఘురాం, దేవరపల్లి సాయి, రంజాన్, యాసిన్, షహిద్ తదితరులు పాల్గొన్నారు.