- కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
- గడపగడపకూ కాంగ్రెస్ ప్రచారంలో జెడ్పీఛైర్మెన్ కోరం కనకయ్య
*మన్యం న్యూస్,ఇల్లందు*:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్డు, ఆంబజార్, కూరగాయల మార్కెట్ తదితర వ్యాపార సముదాయాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గడపగడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో కోరం మాట్లాడుతూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు, వ్యాపారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరం వెంట పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.