UPDATES  

 పట్టు పడతామ్…తెల్లం ని గెలిపించుకుంటాం

 

పట్టు పడతామ్…తెల్లం ని గెలిపించుకుంటాం

*గులాబీ గూటికి పెరుగుతున్న వలసలు
*భద్రాచలం గడ్ద పై గులాబీ జెండా ఎగరడం ఖాయం
*డా.తెల్లం కి టికెట్
*కామ్రేడ్స్ ఆశలు గల్లంతు
* ఆపద సమయంలో భద్రాచలం నియోజకవర్గానికి అపన్న హస్తం అందించిన సీఎం కేసీఆర్
* తాడో.. పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా భద్రాచలం బీ. ఆర్.ఎస్ శ్రేణులు
* గత తప్పులు… ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ నాయకులకు శిక్ష

*మన్యం న్యూస్,చర్ల*: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు,తాత మధు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ లు పట్టుబట్టి డా.తెల్లం వెంకట్రావు ను తిరిగి బి.ఆర్. ఎస్ పార్టీ లోకి తీసుక రావడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే… బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ సైతం తెల్లం వెంకట్రావు వైపు మొగ్గుచూపి తొలి జాబితాలో నే టికెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే భద్రాచలం నియోజకవర్గం నుండి మరో ఇద్దరు టికెట్లు ఆశించగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం డాక్టర్ తెల్లంకి దక్కింది. ఈ నేపథ్యంలో మన్యం న్యూస్ పలు వివరాలు సేకరించింది. దీనిపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
భద్రాద్రి రామయ్య సాక్షిగా గులాబీ జెండా ఎగరడం ఖాయం అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. గతంలో చేసిన తప్పుల మూలంగా సీటును కోల్పోయిన బీఆర్ఎస్ శ్రేణులు… ఐదు సంవత్సరాల నరకం ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ పరిస్థితులలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని కసిగా ఉన్నారు.భద్రాచలం నియోజకవర్గం లో గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరవేసి కేసిఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలని ఆశాభావంతో నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని. అధిష్టానం ఇష్టంతో, తెలంగాణ వీప్ రేగా కాంతారావు భద్రాచలం బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చినా గెలుపు ఖాయమని అన్నారు. ముఖ్యంగా ఆదివాసులు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇదేనని వారి పోడు భూముల సమస్యలను తీర్చి పట్టాలి ఇచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కావున ఆదివాసులు చూపు ఎర్రజెండాని వీడి గులాబీ వైపు ఉందని దీనితో నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలం పెరిగిందని అన్నారు. చర్ల , దుమ్ముగూడెం,వాజేడు, వెంకటాపురం, భద్రాచలం మండలంలో వలసలు పెరుగుతున్నాయని, కామ్రేడ్లు బిఆర్ఎస్ పార్టీ విధానాలు,అభివృద్ధి పథకాలు నచ్చి మా పార్టీలో చేరడం వలన బిఆర్ఎస్ ఓటు బ్యాంకు పెరిగిందని, యువ నాయకులు కూడా అధిక సంఖ్యలో బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో గతంతో పోలిస్తే బీఆర్ఎస్ బలం పెరిగింది. ఏదిఏమైనా త్వరలో జరగనున్న ఎలక్షన్లో ఆ భద్రాద్రి రామయ్య సాక్షిగా భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఐక్యంగా ముందుకు సాగుతాం:
చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోయం రాజారావు
భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో కొన్ని మండలాలలో అలకలు ఉన్నప్పటికీ త్వరలోనే సామరస్యంగా పరిష్కరించుకుంటామని చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు స్వయం రాజారావు మన్యం న్యూస్ కి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !