బిజెపికి తిరుగులేదు: గోవా ఎమ్మెల్యే
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
బిజెపి పార్టీ క్రమశిక్షణతో ముందుకు పోతుందని ఆ పార్టీకి తిరుగులేదని గోవా రాష్ట్ర శాసనసభ్యులు సంకల్ప అమౌంకర్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు విజయవంతంగా ముందుకు పోతున్నాయని తెలిపారు. బిజెపి పార్టీ ఏ ఒక్కరి కోసం పని చేయదని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. బిజెపి నుంచి ఎవరు వెళ్లిన పార్టీకి నష్టం లేదని అన్నారు. నరేంద్ర మోడీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను చూసి అనేకమంది బిజెపిలో చేరడం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు బిజెపి బలం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదన్నారు. ఈ దేశంలో 2024లో కూడా బిజెపి పార్టీ అఖండ విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కె.వి.రంగా కిరణ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరావు, జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్ రావు, నాయకులు ఎడ్లపల్లి శ్రీనివాస్, నరేంద్రబాబు, సీతారాం నాయక్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రవీందర్, మాలోత్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.