పార్టీ మారుతున్నట్లు వస్తున్న దుష్ప్రచారాలు నమ్మొద్దు -మాజీ ఎమ్మెల్యే తాటి
మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఆగస్టు, 22: తనపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దు అని కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు అన్నారు. బిజెపిలో చేరుతున్నట్లు కొంతమంది పని కట్టుకొని మరి ప్రచారం చేస్తున్నారని ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సముచితమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ అశ్వరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సోమవారం హైద్రాబాద్ లో గాంధీ భవనంలో దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కావాలని కొంతమంది రాజకీయ కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు.