కాంగ్రెస్ వాగ్దానాలు నీటి మీద రాతలు!
అధికారం కోసం అక్కరకు రాని వాగ్దానాలు!
దేశానికి దిక్సూచి కేసిఆర్ పథకాలు…
*అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో రేగాను మించిన ఎమ్మెల్యే లేరు
* మరో మారు మంచి మెజారిటీతో ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలవబోతున్నారు
* టికెట్ కోసం కొట్టుకునేటోళ్లు ప్రజలకు ఏం సేవ చేస్తారు
బీ. ఆర్ ఎస్ జిల్లా అధికార ప్రతినిధికోలేటి భవాని శంకర్.
మన్యం న్యూస్, పినపాక:
ఆధారం లేని, అక్కరకు రాని వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ సమయం వృధా చేసుకుంటుందని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. గురువారం నాడు ఈ. బయ్యారం క్రాస్ రోడ్డు లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారం చేజెక్కించుకోవడం కోసం ఎన్నడూ ఎరుగని వాగ్దానాలు చేస్తుందని, అవి ఎప్పటికీ నెరవేరేవి కావని అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసేలా కేసిఆర్ సంక్షేమ పథకాలను అవలంబిస్తున్నారని, రైతును గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతే రాజు అనే నానుడిని నిజం చేస్తూ కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. టికెట్ కోసం కొట్టుకునే వాళ్లు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేగా కాంతారావు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆసరా పథకాన్ని ఎవరూ చెప్పకుండానే కేసీఆర్ ఆసరా అందిస్తున్నారని, ఇటీవలనే వికలాంగులకు వారి ఆసరా పెంచారని, 57 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఆసరాను తెలంగాణలో పొందుతున్నాడని అన్నారు. రేగా కాంతారావు పార్టీ మారిన దగ్గర నుండి విమర్శిస్తున్నారు తప్ప, ఆయన చేసిన అభివృద్ధిని గురించి మాత్రం మాట్లాడడానికి నోరు రావడం లేదు. పార్టీ మారడం అభివృద్ధి కోసమే జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలని ఆయన అన్నారు. అభివృద్ధి చేసిన వారిని అందలం ఎక్కించడం తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. మీరు ఇచ్చే వాగ్దానాలు నీటి మీద రాతలేనని, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాలు రేగా కాంతారావు కృషితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, అభివృద్ధిని గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.