మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కేర్ ఆసుపత్రికి వెళ్లి మురళి కృష్ణను పరామర్శించడం జరిగింది. అనంతరం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట చీమకుర్తి సాయిచరణ్ తదితరులు పరామర్శించారు.