UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
* ఆరోగ్య మహిళ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
* అంగన్వాడి కేంద్రాలు ఇంత దరిద్రంగా ఉంటాయా
* కేంద్రాల నిర్వహణ తీరుపై కలెక్టర్ అసహనం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మహిళలు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమసమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్
డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు
మొదటి దశలో మార్చి 8వ తేదీన జిల్లాలో ఐదు ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేశామని రెండవ విడత
జిల్లాలో 9 మండలాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు ఆరోగ్య సమస్యలను
బయటికి చెప్పుకోలేక ప్రమాదాలకు గురవుతున్నారని గమనించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు
ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్యులచే ప్రత్యేక ఆరోగ్య
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే వైద్య సేవలపై గ్రామాలు, వార్డుల్లో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలు పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సులక్షణ, యంపిపి సుజాత, సర్పంచ్ శారద జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష,
డిఆర్డిఓ మధుసూదన్ రాజు, జిల్లా ఉపాధికల్పనాధికారి విజేత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజేత, ఉప
వైద్యాధికారి డాక్టర్ రాజ్కుమార్, వైద్యాధికారి డాక్టర్ సంకీర్తన తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అంగన్వాడి కేంద్రం తెరిచి ఉండాలి….
ప్రతి అంగన్వాడీ కేంద్రం తెరిచి ఉండాలని సేవలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మహిళా శిశుసంక్షేమ అధికారులకు సూచించారు. మంగళవారం అశ్వాపురం మండలం అంబేద్కర్ నగర్ లోని
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం జంగిల్ల ఉంది, దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, కేంద్రం ఇంత అపరిశుభ్రంగా ఉంటే చిన్నారులు ఎలా ఆరోగ్యంగా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో వర్షపు నీరు నిలుస్తున్నదని అలా నిలవకుండా పంచాయతీ అధికారులను ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కేంద్రానికి సరఫరా అయిన కోడిగుడ్లును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సులక్షణ, యంపిపి సుజాత, సర్పంచ్ శారద, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సిడిపిఓ సీత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !