మన్యం న్యూస్, అశ్వరావుపేట, సెప్టెంబర్, 14: మండల పరిదిలోని అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం నాలుగో రోజు చేరింది. ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన పలువురు రాజకీయ నాయకులు సమ్మె శిబిరం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పేరాయి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నార్లపాటి సుమతి మాట్లాడుతూ.. ఏడబ్ల్యూసి భవనానికి తాళాలు పగలగొట్టడం సిగ్గుమాలిన పని అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మాట్లాడుతూ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి మనం రోడ్డు మీదకు రావలసి వచ్చింది . అంగన్వాడీ లు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైనది అని అన్నారు, ఈ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం వీరికి న్యాయం జరిగే వరకూ అంగన్వాడి భవనాలకు వేసిన తాళాలు తీస్తే ఊరుకునేదే లేదు మేము వీళ్లకు అండదండగా, ఉన్నామని అన్నారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కట్రం స్వామి దొర, మాట్లాడుతూ, మీరు చేసే ఈ సమ్మెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నుండి బిడ్డకు ఐదు సంవత్సరాలు పూర్తి అయినంత వరకు ఉంటారు మీరు చేసే సేవలు చాలా విలువైనవి మీరు చేసే ఈ సమ్మె న్యాయమైన సమ్మె అనిఅన్నారు, ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడి అంగన్వాడి టీచర్లకు డిమాండ్లను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ డబ్ల్యు టి, ఏ డబ్ల్యు హెచ్, యూనియన్ లీడర్లు, కే రాధ, ఎన్ కృష్ణవేణి, రాజేశ్వరి, ఉష, విజయ, నాగమణి, భాగ్యలక్ష్మి, ఆర్కే ఎం లక్ష్మి, వాణి, ప్రవీణ, వెంకటరమణ, కుమారి, ప్రభావతి, లక్ష్మి, సరోజినీ, అమ్మోజి, సావిత్రి, వేదవతి, రాణి, ఆదిలక్ష్మి, రాజేశ్వరి, ఉష, లక్ష్మి, కుమారి, నర్సమ్మ, నాగలక్ష్మి, తులసీరత్నం, తదితరులు పాల్గొన్నారు.