మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 17::
మండల పరిధిలోని ప్రగళ్ళపల్లి పంచాయతీలో ఎంపీడీవో ముత్యాలరావు ,స్థానిక సర్పంచ్ జుంజురి లక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన మొదటి రోజు గ్రామపంచాయతీ శ్రమదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశుద్ధ వారోత్సవాలు వారం రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో రోజువారిగా పారిశుద్ధంపై చేయవలసిన పనులను వివరించినట్టు తెలిపారు ఈ శ్రమదాన కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ప్రజలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.