మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-బూర్గంప హాడ్ మండల పరిధిలోని వైన్ షాపుల్లో దొంగలు పలుమార్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు.గతంలో చీప్ లిక్కర్ ని చోరీ చేసిన దొంగలను గతంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకొని మధ్యం స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.కాగా అట్టి దొంగతనాలు మరువక ముందే మళ్ళీ మండలంలో మళ్ళీ చీప్ లిక్కర్ గాళ్ళ అలజడి లేపారు.సారపాకలో పెట్రోల్ బంక్ సమీపంలో పక్కపక్కన ఉన్న రెండు వైన్ షాపుల్లో గల ఒక వైన్ షాప్ లో దొంగలు పడి మద్యం బాటిల్లు చోరీ చేశారు ఆదివారం ఉదయం వైన్ షాప్ తీయడానికి వచ్చిన వైన్ షాప్ యాజమాన్యం షాప్ తాళాలు పగల కొట్టి ఉండడం గమనించి కంగు తిన్నారు.వెంటనే విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటన స్థలంకి చేరుకున్న బూర్గంపహాడ్ ఎస్ఐ రాజ్ కుమార్ అట్టి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో జూన్ నెలలో మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో లక్ష్మీ భవాని అనే వైన్ షాపులో సుమారు మూడు లక్షల నలభై వేల రూపాయల మధ్యం చోరీ అయిన విషయం విదితమే.కాగా పోలీసులు చాకచక్యంగా సుమారు 20 లక్షల రూపాయల మధ్యం సీసాలను స్వాధీనం చేసుకున్న విషయం కూడా తెలిసిందే.కాగా నూతన వైన్ షాప్ టెండర్లు అయినా క్రమంలో వైన్ షాప్ లో దొంగలు పడడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.మరి మళ్ళీ ఈ చీప్ లిక్కర్ గాళ్ళు దొంగిలించిన మధ్యం ఎంత అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.