మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని పగిడేరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వల్లేపోగు. నాగేశ్వరరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు బిఅర్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దెల. తిరుమలరావు వల్లే.పోగు నాగేశ్వరరావు పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రాగడ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఏంపల్లి.గంగయ్య,గురజాల. ప్రశాంత్ మంజూరి.నాగరాజు, ప్రసాద్,కృష్ణ,కాళ్ల.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.