మన్యం న్యూస్,మణుగూరు:
వినాయక చవితి పండుగ సందర్భంగా విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే రేగా కాంతరావు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని రేగా కోరారు. విగ్నేశ్వరుని కృపతో విఘ్నాలన్ని తొలగి, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు గణేష్ ఉత్సవాలను ఆనందోత్సాహలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విప్ రేగా కాంతరావు సూచించారు.
