మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 18వ తేదీన వినాయక ఉత్సవాలు మొదలు కానుండడంతో ఆదివారం జిల్లా కేంద్రంలోని సూపర్ బజార్ ఏరియాలో వినాయక సందడి కనిపించింది. ప్రజలు సూపర్ బజార్ సెంటర్ కొచ్చి వినాయక విగ్రహాలను, తాటి పత్రిలను కొనుగోలు చేయడం జరిగింది. పూణే ముంబై ప్రాంతాల నుండి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలను అమ్మకాలు సాగిస్తున్నారు. ఏడాది వినాయక విగ్రహాలను ఎక్కువగా పెడుతున్నారని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు.
