UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 సూర్యలో జ్యోతికకు పిచ్చిగా నచ్చే క్వాలిటీ

కోలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో సూర్య-జ్యోతిక జంట ఒకటి. ఈ జోడీకి కేవలం కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది.

సూర్య, జ్యోతిక మొదటిసారి `పూవెల్లమ్ కెట్టుప్పర్` అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి 2006లో సూర్య, జ్యోతిక వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

 

పెళ్లి తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న జ్యోతిక.. ఒక పాప, బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు భర్త సపోర్ట్ తో జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది. వయసుకు తగ్గా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే నిర్మాతగా సత్తా చాటుతోంది. మరోవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ బిజీ ఉమెన్ గా లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 

సూర్యను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పేసింది. ప్రపోజ్ చేయడం నుంచి పెళ్లి వరకూ అంతా నెల రోజుల్లోనే అయిపోయిందని జ్యోతిక తెలిపింది. `సూర్య నాకు ఎంతో గౌరవం ఇస్తాడు. అదే సూర్యలో నాకు పిచ్చిగా నచ్చే క్వాలిటీ. ఆ క్వాలిటీ వల్లే మా పెళ్లి కూడా జరిగింది. సూర్యతో కలిసి ఏడు సినిమాలు చేశాను. ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఎంతో గౌరవంగా నడుచుకునేవాడు. ఇక పదేళ్లు సినిమాలు చేసి అలిసిపోయాను. ఆ టైమ్ లోనే సూర్య ప్రపోజ్ చేశాడు. నా ఫ్యామిలీని కూడా ఒప్పించాడు. ఇక నో అని చెప్పలేకపోయాను. అలా సూర్య ప్రపోజ్ చేసిన నెల రోజులకే పెళ్లి చేసుకున్నాము` అని జ్యోతిక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !