మన్యం న్యూస్, వాజేడు :
నాకు బతుకలని ఉంది…నన్ను బ్రతికించండి అంటూ నిస్సహాయ స్థితిలో …కడుపులో పుట్టెడు బాధతో … హాస్పిటల్ బెడ్ పై విగతజీవిగా పడి ఉన్న ఓ వ్యక్తి దాతలను వేడుకుంటున్నారు. తనకి ఆర్థిక సహాయం చేసి తన ప్రాణాన్ని నిలబెట్టాలని మనసున్న మహారాజులను కోరడమైనది.వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద ములుగు జిల్లా వాజేడు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గొంది అరవింద్ కుమార్ అనే వ్యక్తి ధీన గాథ. హనుమకొండ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొడుకు ఆరోగ్యం కొరకు తల్లిదండ్రులు వారికి ఉన్న ఆస్తులు సైతం అమ్మి వైద్యం చేపిస్తున్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం రూ.5లక్షలు తక్షణమే కట్టవలసిందిగా డాక్టర్లు తెలిపారు. అంత డబ్బు చెల్లించి స్థితి ఆ కుటుంబానికి లేదు. దీనితో వారు ఏమి పాలుపోని స్థితిలో ఉన్నారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు హాస్పిటల్ బెడ్ పై అచైతన్య స్థితిలో పడి ఉండడంతో ఆ వృద్ధ దంపతులు బోరున విలపిస్తున్నారు. తమ కొడుకును బతికించుకోవడానికి ఉన్న యావద ఆస్తి ధారపోశారు. తమ కొడుకు వైద్యానికి డబ్బులు కావాలని బోరున విలపిస్తున్నారు. పేదరికంతో ఐసీయూలో ఉన్న వ్యక్తిని మానవ ప్రయత్నంగా, విశాల హృదయంతో దాతలు ఆదుకోవాలని పేదరికంలో కొట్టుమిట్టాలాడుతున్న వ్యక్తికి మరో జన్మ ఇవ్వవలసిందిగా దాతలను తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు.దాతలు 7901369461 అనే ఫోన్ నెంబర్లు సంప్రదించాలని వారు కోరారు.