బీఆర్ఎస్ పార్టీ తోనే భరోసా
*మెచ్చా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
రాహుల్ గాంధీ తెలంగాణ సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నాడు…
12 రాష్ట్రాల కూలీలకు అన్నం పెట్టే రాష్ట్రంగా నేడు తెలంగాణ…
చండ్రుగొండ జెడ్పీటీసీ వెంకటరెడ్డికి పార్టీలోకి సాధరంగా ఆహ్వానం…
ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు…
మన్యం న్యూస్,చండ్రుగొండ, అక్టోబర్ 19: తెలంగాణ సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తుంటే కనీసం మద్దతు తెలపకుండా రాహుల్ గాంధీ మౌనంగా ఉండి,ఇప్పుడు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఏ మొఖం పెట్టుకొని వచ్చాడని, ఖమ్మం పార్లమెంటు సభ్యులు, బిఆర్ఎస్ లోక్సభపక్షనేత నామా నాగేశ్వరావు ప్రశ్నించాడు. అశ్వారావుపేట నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుని అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు మరోమారు భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నారని జోష్యం చెప్పారు. గురువారం సాయంత్రం చండ్రుగొండలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన, రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధరెడ్డితో కలిసి బిఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.తొలుత చండ్రుగొండ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొణకండ్ల వెంకటరెడ్డిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వనించారు. తెలంగాణ రాక ముందు వలస వెళ్లి బ్రతికే వాళ్లమని, దాదాపుగా 25 లక్షల మంది తెలంగాణ బిడ్డలు వలస వెళ్లి జీవించే వారని, స్వరాష్ట్రం వచ్చిన తరువాత దేశంలోని 12 రాష్ట్రాల కూలీలకు అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజారితో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మెచ్చ నాగేశ్వరరావును గెలిపించి, ముచ్చగా మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే నాయకుడికే ప్రజల మద్దతును ఇవ్వాలన్నారు. బిఆర్ఎస్ మ్యానిపేస్టో చూసి ప్రతిపక్షపార్టీలకు నోళ్లు పెగలటం లేదన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైకా రాష్ట్రం తెలంగాణ అని, రైతుబంధు పథకం రైతులకు అండగా, ఆర్ధిక భరోసా ఇస్తుందని, రాబోయే రోజుల్లో 16వేలు ఇస్తామన్నారు.
పేదల గురించి ఆలోచించే నాయకుడు సిఎం కేసీఆర్ : బండి పార్ధసారథరెడ్డి, రాజ్యసభ సభ్యులు
నిత్యం పేదల గురించి ఆలోచిస్తూ, ఆ ఆలోచనలను సంక్షేమ పథకాలుగా తీర్చిదిద్దుతున్న నాయకుడు సిఎం కేసీఆర్ అని రాజ్యసభసభ్యులు బండి పార్ధసారధరెడ్డి అన్నారు: పిల్లల చదువుకోసం గురుకులాలను ఏర్పాటు చేసి, వారి భవిష్యత్ కోసం బంగారుబాట వేశాడని, అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలన్నారు. నేను ప్రపంచ దేశాలు.
తిరుగుతుంటానని, నిత్యం పేదల గురించి ఆలోచించే నాయకుడు నాకు కనపడలేదని, కాని కేసీఆర్ చూస్తూ ఆశ్చర్యం, ఆదర్శం కలుగుతుందన్నారు. నన్ను రాజ్యసభకు పంపి బాధ్యతను పెంచడాని, ఆయన పెట్టిన బాధ్యతను పూర్తి చేస్తానన్నారు. చండ్రుగొండ జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డికి అన్ని విధలా అండగా ఉంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వెంకటరెడ్డి లాంటి నాయకుడు బిఆర్ఎస్ లోకి రావడం మనకు మంచిదన్నారు.
చండ్రుగొండ మండల అభివృద్ధికి చిరునామా: అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు
…చండ్రుగొండ జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లోకి రావడం సంతోషమని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదని, నేడు బిఆర్ఎస్ పరిపాలనలో చండ్రుగొండ అభివృద్ధికి చిరునామాగా మారిందిన అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం ఖాయమన్నారు. అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా సిఎం పనిచేస్తున్నాడని, సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతున్నాయన్నారు. అనంతరం పార్టీలోకి “వచ్చిన వారందరికి గులాబీ కండువ కప్పి సాధరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, దారా వెంకటేశ్వరరావు(దారాబాబు), ఉప్పతల ఏడుకొండలు, నల్లమల్ల వెంకటేశ్వరరావు, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, సయ్యద్ రసూల్, భూపతి రమేష్, సూర వెంకటేశ్వరరావు, నల్లమోతు వెంకటనారాయణ, సత్తి నాగేశ్వరరావు, గాదె లింగయ్య, భూపతి ధనలక్ష్మి, లంకా విజయలక్ష్మి, జడ వెంకయ్య, చీదెల్ల పవన్ కుమార్, గుగులోత్ – శ్రీనివాస్నాయక్, భూపతి శ్రీనివసారావు, బానోత్ రన్య, భానోత్ కుమారి, భూక్య రాజి, పూసం వెంకటేశ్వర్లు, మద్దిరాల చిన్నిపిచ్చయ్య, గుగులోత్ రమేష్, వంకాయలపాటి బాబురావు, ఇమామ్, ఓరుగంటి రాములు, బోయినపల్లి సుధాకర్రావు, మోరంపూడి అప్పారావు, బండి పుల్లారావు, గుగులోత్ ప్రవీణ్ ప్రకాశ్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు.