మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరుతో జైలు నుండి ఆయన విడుదలైన సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్
ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రాంతంలో హర్షం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలం పాటు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని పువ్వాడ పేర్కొన్నారు. చంద్రబాబును కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారని ఆ కుట్రలను తిప్పికొట్టి వారు చేస్తున్న న్యాయపోరాటంలో అంతిమంగా న్యాయం విజయం సాధిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.