కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టించే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ మొదటి వరుసలో ఉంటుంది. ఆమె అందం, అభినయం అలాంటిది మరి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘లేకే ప్రభు కా నామ్..’ పాట తనకు ఎంతో ఇష్టమని, ఇందులో 7 అద్భుతమైన లుక్స్‌తో అలరిస్తానని కత్రినా చెప్పుకొచ్చింది.