మన్యం న్యూస్ గుండాల: హంగు ఆర్భాటాలకు ఆయన ఆమడ దూరంలో ఉంటారు ఆయనే బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. శనివారం గుండాల మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం భోజనాన్ని కార్యకర్తల మధ్య చేశారు ఎటువంటి అంగుహార్భాటాలకు పోకుండా తనదైన శైలిలో సాధారణ కార్యకర్త వలె చెట్టు కింద నిలబడి భోజనం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, విప్ గా అత్యంత స్థాయిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలతో మమేకమై రేగ భోజనం చేసిన తీరు ను ఆ పార్టీకార్యకర్తలు చర్చించుకున్నారు. నాయకుడంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలని.. అది రేగా కాంతారావు వలె అని బీ ఆర్ ఎస్ కార్యకర్తలు మాట్లాడుకున్నారు.