UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం ఆలోచించండి ఆదరించండి..గుండాల మండల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రేగా కాంతారావు..

 

మన్యం న్యూస్ గుండాల: ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ దేయమని ఆలోచించి ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం గుండాల మండలంలో పర్యటించిన రేగా కాంతారావు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రగతిని సాధిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రజలు ఆలోచించాలని ఆలోచించే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన పరిస్థితి ఏంటో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి ప్రగతిని సాధించాము మీకు తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అంధకారంలో ఉండేదని ఆనాడు సంక్షేమ పథకాలు 1000 లో ఒక్కరికి మాత్రమే దక్కేవని నేడు సంక్షేమం అంటే ప్రతి ఇంటి గడపను తట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని అన్నారు. నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గుండాల మండలాన్ని ఎంతగా అభివృద్ధి చేశానో మీరు గమనించాలని కోరారు నాకంటే ముందు ఎమ్మెల్యేగా గెలిచిన పాయం వెంకటేశ్వర్లు గుండాల మండలానికి ఏమి చేశారో కూడా తెలుసని అన్నారు. మండలంలో ప్రవహిస్తున్న ప్రధాన వాగులపై వంతెనలను నిర్మించి గ్రామాలకు మెరుగైన రహదారిని కల్పించింది నేను కాదా అని ప్రజల ఆలోచించలేని అన్నారు. గతంలో రెండు సార్లు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వచ్చి ఆదరించండి అభివృద్ధి చేస్తానని అబద్ధపు హామీలను ఇస్తున్నాడని ఆనాడు చేయలేని ఆయన ఈనాడు చేస్తాడా అని అన్నారు. తన ఇంటి ముందు రోడ్డునే తాను వేసుకోలేని నాయకుడు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంత మేర ముందుకు తీసుకుపోతాడు ఆలోచించాలని కోరారు. ఎన్నికల సమయంలో నాయకులు వస్తుంటారని వాళ్ళు ఇచ్చే హామీలు గతంలో కానీ భవిష్యత్తులో కానీ చేసే సత్తా ఉన్న నాయకులైన అని ప్రజలే ఆలోచించాలని కోరారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే నాయకులను నమ్మి ఆగం కావద్దని ఆయన కోరారు. అభివృద్ధికి సహకరించే నాయకుల ఎవరు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని అందించిన నాకు మరో అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గుండాల మండల ప్రజలను కోరుతున్నానని అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !