UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 నరేంద్ర మోడీ గుంట నక్క..

 • నరేంద్ర మోడీ గుంట నక్క
 •  సింగరేణిని మింగేసేందుకు ప్రయత్నం
 •  కేసీఆర్ తోనే సింగరేణికి శ్రీరామరక్ష
 • కార్మికులకు అధిక లాభాల బోనస్ కేసీఆర్ ఘనతే
 •  విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డుగా మోడీ
 •  బీఆర్ఎస్ వస్తేనే అందరికీ సంపూర్ణ న్యాయం
 • గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు
 • కారు గుర్తుకు ఓటు వేసి వనమాను గెలిపించండి
 • సూపర్ బజార్ సెంటర్ రోడ్ షోలో కేటీఆర్
 •  భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ రోడ్ షోలు సక్సెస్
 • కేటీఆర్ కు పుదీనా ఆకుల దండతో స్వాగతం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ప్రైవేటీకరణకు నిలయంగా మారిందని దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా ఉన్న సింగరేణి సిరుల తల్లి సంస్థను మింగేసేందుకు గుంట నక్కల కాచుకొని ఉన్నాడని పురపాలక సంఘం, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు(కేటీఆర్) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్ బజార్ సెంటర్ లోని కొత్తగూడెం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు

విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం రోడ్ షో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణిని మింగేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని ఇది జరగకుండా ఉండాలంటే తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తోనే సింగరేణికి శ్రీరామ రక్షా అని పేర్కొన్నారు. గతంలో సింగరేణిని ప్రవేట్ పరం చేసేందుకు నరేంద్ర మోడీ కుట్ర పన్నితే దానిని సీఎం కేసీఆర్ అడ్డుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి అభివృద్ధిలో నడిచిందని తెలిపారు. కంపెనీకి వచ్చిన లాభాల్లో నుండి కార్మికులకు అత్యధికంగా లాభాల బోనస్ అందిస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు కీలక పాత్ర పోషించారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాల గడ్డ భద్రాద్రి కొత్తగూడెం అని కేటీఆర్ గట్టిగా నొక్కి చెప్పారు. కొత్తగూడెం ప్రజలందరికీ తెలంగాణపై ఎంతో విశ్వాసం ఉందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే, ఇక్కడ ప్రజల అభిమాన నాయకుడు అందరివాడు వనమా వెంకటేశ్వరరావు గెలుపుకు కొత్తగూడెం చైతన్యం చూపించాల్సిన సమయం దగ్గర పడిందని కేటీఆర్ అన్నారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కారు గుర్తుపై ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వనమా గెలుపు అభివృద్ధికి మలుపు కావాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్తగూడెం అభివృద్ధికి నిధుల వరద పారిస్తామన్నారు.

*గిరిజనేతరులకుపోడు భూముల పట్టాలు..*

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎక్కువగా పట్టాలు భద్రాద్రి కొత్తగూడెంకు ఇచ్చామని పేర్కొన్నారు. పోడు పట్టాలతో గిరిజనులు ఆదివాసుల జీవితాలలో వెలుగులు నిండాయని తెలిపారు. అంబా సత్రం భూముల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేగళ్ల గ్రామంలో నెలకొన్న పట్టాల సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

*కొత్తగూడెంకు విమానాశ్రయం రావడానికి కృషి…*

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విమానాశ్రయంను తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో విమానాశ్రయం ఏర్పాటుకు కొత్తగూడెంలో సర్వే సైతం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే విమానాశ్రయం ఏర్పాటుకు నరేంద్ర మోడీ అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. అయినప్పటికీ ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కచ్చితంగా విమానాశ్రయంను తీసుకొచ్చేందుకు పోరాడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

*వనమాను గెలిపిస్తే అర్హులందరికీ పథకాలు…*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వరరావును ఓటర్లు గెలిపిస్తే అర్హులందరికీ సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు రైతుబంధు బీసీ బందు వంటి పథకాలతో పాటు మరికొన్ని రకాల పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని అందుకు కారు గుర్తుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ(చిన్ని), జేవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

*మంత్రి కేటీఆర్ రోడ్ షోలు సక్సెస్…*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్ షోలు సక్సెస్ అయ్యాయి. కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు నాలుగు నియోజకవర్గాల వారీగా పురుషులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !