UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా! కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. మారుమూల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన.. తెల్లం..

మన్యం న్యూస్, దుమ్ముగూడెం నవంబర్ 20::

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మీ సమస్యలన్నీ తీరుస్తానని భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం మండలంలోని ఎన్నికల ప్రచార లో భాగంగా మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కోయ నర్సాపురం చెరుపల్లి కొత్తపల్లి రామచంద్రుని పేట నడికుడి అచ్చుతాపురం తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంట పొలాల్లో పని చేసుకుంటున్నా రైతులు కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ నేను గెలిచిన వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని రైతుల కోసం ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కారు గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం చెరిపెల్లి గ్రామంలో కాక వారి గుంపు నుండి టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆకర్షితులై మండల అధ్యక్షులు సత్యాలు ఆధ్వర్యంలో 40 కుటుంబాలు బి ఆర్ ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం పార్టీ జెండా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం మండలంలోని నడికుడి గ్రామం లో 100 మంది ఆదివాసి పాస్టర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ తో మాట్లాడిన వెంకట్రావు స్థానికంగా వారికున్న ఇబ్బందులు తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు నడికుడి, అచ్యుతాపురం గ్రామంలో బి ఆర్ ఎస్ కార్యకర్త మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి, ఎంపీటీసీ తిరుపతిరావు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఎండి నవాబ్ ఉబ్బ వేణు ముర్రం వీరభద్రం రేసు శీను కల్లూరి అదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !