UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ..దళిత బంధు, బీసి బంధు,మైనారిటీ బంధు పథకాలు కొనసాగిస్తాం..

  • సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ
  • దళిత బంధు, బీసి బంధు,మైనారిటీ బంధు పథకాలు కొనసాగిస్తాం
  • ప్రతి నెల లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది
  •  ప్రజలు ధైర్యపడాల్సిన పనిలేదు
  • అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
  • బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు

మన్యం న్యూస్ ,పినపాక:సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని .. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వవిప్, పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు.సోమవారం ఆయన తోగ్గుడెం, పినపాక, ఉమ్మడి ఉప్పాక,ఏడూళ్ల బయ్యారం పంచాయతీ లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన రోడ్డు షోలలో మాట్లాడారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందాయని, అభివృద్ధిని చూసి ఓటేయాలని తెలంగాణ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు కోరారు.

గోవిందాపురం,

తోగ్గుడెం,గోపాల్ రావు పేట, పినపాక,గడ్డంపల్లి, నారాయణపురం,బోటి గూడెం, బందగిరి నగరం,మడతన కుంట,సీతంపేట, ఉప్పాక, పెంటన్నగూడెం,బొమ్మరాసు పల్లి,ఏడుళ్ల బయ్యారం,

ఎల్చిరెడ్డిపల్లి,పాత రెడ్డిపాలెం గ్రామాలలో పర్యటించారు. పినపాక నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు అందజేస్తామని తెలియజేశారు. బీసీ వర్గాలకు సైతం బీసీ బందు ప్రవేశపెట్టిన ఘనత కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పుట్టిన దగ్గర నుండి చివరి దశ వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి అందించిన ఘనత, రైతులను గుర్తించి ఉచిత కరెంట్, రైతుబంధు, పంటకు మద్దతు ధర బిఆర్ఎస్ ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ ని నమ్మవద్దని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

కేసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ,రైతు సమన్వయ మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎస్కె జహంగీర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బొలిశెట్టి నరసింహారావు, భవాని శంకర్, కొండేరు రాము, కొండేరు నాగభూషణం, రాయల సత్యనారాయణ ,బాబు, బత్తుల వెంకటరెడ్డి, ఐరన్ షాప్ వెంకటేశ్వర రెడ్డి,సత్తి రెడ్డి, సురేష్ ,సోంపేల్లి తిరుపతి, రాజు,బండ మనోజ్ రెడ్డి,ప్రశాంత్,తోకల సతీష్, సిసింద్రీ, సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు సోషల్ మీడియా సభ్యులు శ్యామల సతీష్, క్లాసిక్ గోగు రామకృష్ణ, సందీప్, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !