మన్యం న్యూస్,పినపాక:
మండలం బోటి గూడెం గ్రామంలో ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పొట్లపల్లి గ్రామపంచాయతీ చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలేం సతీష్, బడే చలపతిరావు, చర్ప శరత్ కోరిపల్లి సత్యం ,బడే లక్ష్మణరావు లు, బిఆర్ఎస్ లో చేరారు ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.