UPDATES  

 ఎన్నికల నామ సంవత్సరం 2024.. పెను మార్పు దిశగా ప్రపంచ రాజకీయాలు..!

2024 సంవత్సరంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన భారత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఆల్ ఇండియా ఎన్నికల ఫైట్.. బిజేపీ కూటమి వర్సెస్ INDIA కూటమిగా ఉండడంతో.. పోటీ రసవత్తరంగా మారిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో దాదాపు బిజేపీ యేతర పార్టీలన్నీ INDIA కూటమిగా ఏర్పడి.. మూడోసారి ప్రధాన మంత్రి అయ్యేందుకు బరిలోకి దిగుతున్న నరేంద్ర మోదీతో బలంగా ఢీకొనబోతున్నాయి. ఇండియాలో 60 కోట్లకు పైగా ఓటర్లున్నారు.

 

అయితే ఈ పరిస్థితి ఒక్క భారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో ప్రపంచలోని 78 దేశాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి.

 

2024 ప్రపంచ ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సంవత్సరమే చెప్పాలి. ఇన్ని దేశాలలో ఒకే సంవత్సరంలో ఎన్నికలు జరగడం అనేది మళ్లీ 2048లోనే జరుగవచ్చని వాషింగ్టన్‌లోని థింక్ ట్యాంక్ అట్లాంటిక్ కౌన్సిల్ అంచనా.

 

ఎన్నికలు జరగబోయే దేశాలలో G20, G7 లాంటి శక్తివంతమైన సమూహ దేశాలు ఉండడంతో ఈ సంవత్సరలో ప్రపంచ రాజకీయాలలో పెను మార్పు జరగబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం చివరిలో అంటే నవంబర్‌లో జరిగే అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఈసారి ఉత్కంఠగా మారబోతున్నాయి. గత ఎన్నికలు రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ డెమోక్రాటిక్ అభ్యర్థి బోబైడెన్ గా సాగింది.

 

ఈ సారి గత ఎన్నికలకు రీ మ్యాచ్ జరగబోతోందని అని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈసారి ప్రెసిడెంట్ జో బైడెన్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్‌ అయ్యే అవకాశాలున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్‌ ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి కొన్ని కోర్టు కేసులు అడ్డంకులుగా మారాయి. అయినా జో బైడెన్ వయసు ఆరోగ్యం రీత్యా ఆయన మళ్లీ ఎన్నికల్లో నిలబడితే.. అమెరికా ప్రజలు ఆయనకు ఓటేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావంతో ప్రపంచ దేశాల విదేశాంగ పాలసీలలో కూడా తప్పకుండా మార్పు ఉంటుంది.

 

అలాగే ప్రపంచంలో అమెరికా తరువాత పవర్ ఫుల్ దేశమైన రష్యాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ అక్కడ పుతిన్ ఉండగా.. మరో నాయకుడు ఎన్నికలు గెలుస్తాడనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. పుతిన్ మళ్లీ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడం లాంఛనమే.

 

ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఆసియా దేశాలున్నాయి. ఇప్పటికే భారత పొరుగుదేశం బంగ్లాదేశ్ ఎన్నికలు ముగిశాయి. అక్కడ నాలుగోసారి విజయం సాధించిన షేక్ హసీనా.. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ఒక దేశానికి అధ్యక్షురాలుగా పనిచేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. మరో ఆసియా దేశం తైవాన్ ఎన్నికలు జనవరి 13న ముగిశాయి. అక్కడ చైనా వ్యతిరేక డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(డిపిపి) మూడో సారి అధికారం సాధించింది. డిపిపి అగ్రనేత లాయి చింగ్ తె అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తైవాన్‌పై మిలిటరీ దాడి చేసి ఆక్రమించుకుంటామని చైనా ఇటీవల పలుమార్లు చెప్పింది. ఇందుకోసం తన మిలిటరీని సిద్ధం కూడా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తైవాన్ ప్రజలు చైనా వ్యతిరేక పార్టీకి జైకొట్టడం గమనార్హం.

 

ఇక ఇండియాకు పక్కలో బల్లెం పాకిస్తాన్‌లో కూడా 2024 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. పాకిస్తాన్ ఎన్నికల్లో ఈసారి పిపిపి, పిఎమ్ఎల్ఎన్, పిటిఐ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ లాగే ముస్లిం జనాభా మెజారిటీలో ఉన్న ఇండొనేషియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇండోనేషియా ప్రస్తుత అధికార పార్టీయే విజయం సాధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

ఆ తరువాత 2024 మే నెలలో దక్షిణాఫ్రికాలో ఎన్నికలు జరుగనున్నాయి. దక్షిణాఫ్రికాలో 1994 సంవత్సరంలో జరిగిన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం జరగడంతో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత మళ్లీ అంతటి ప్రాముఖ్యం ఉన్న ఎన్నికలు 2024లో జరుగనున్నాయి. దక్షిణాఫ్రికాలోని అల్జీరియా, బోత్సవానా, చాడ్, కొమొరోస్, ఘానా, మారిటానియా, మారిషస్, మొజాంబిక్, నమీబియా, రవాండా, సెనెగల్, సొమాలీ ల్యాండ్, దక్షిణ సుడాన్, టునీషియా, టోగో దేశాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆఫ్రికా ఖండంలోనే ఈ సంవత్సరం అత్యధిక దేశాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.

 

అలాగే యూరోప్ ఖండంలో కూడా చాలా దేశాల ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే ఈ దేశాలలో అధికారంలో ఉన్న పార్టీలకు విజయం సాధించడం అంత ఈజీ కాదని తెలుస్తోందని. యూరోప్‌లోని 10 కంటే ఎక్కువ దేశాలలో పార్లమెంట్ ఎన్నికలు లేదా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఫిన్ ల్యాండ్, బేలారూస్, పోర్చుగల్, యూక్రెయిన్, స్లోవేకియా, లిథుఆనియా, ఐస్‌ల్యాండ్, బెల్జియం, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు, క్రొయేషియా, ఆస్ట్రియా, జార్జియా, మొల్దోవా, రోమానియా దేశాలలో ఎన్నికలున్నాయి.

 

యూరోపియన్ యూనియన్ దేశాలలో 27 దేశాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, స్వీడెన్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. యూరోప్ దేశాలలో ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించే పార్టీలకు ఎక్కువ మెజారిటీ దక్కే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో యూరప్ దేశాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !