UPDATES  

 రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు…

 

 

మన్యం న్యూస్, మంగపేట.

 

మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ లో భాగం గా రెండోవ రోజైన బుధవారం ఉదయం శ్రీనాగులమ్మ మూల విరాట్ కు బాడిశ రామకృష్ణ స్వామీజీ పూజలు నిర్వహించి,వివిధ దళాలతో,పుష్పాలతో,పసుపు,కుంకుమ,తేనె మరియు గోదావరి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణం లో ఉన్న సమ్మక్క సారక్క ,పగిడిద్దరాజు,ఘడికమారాజు,ఎర్రమ్మ,కంఖ నాగుల గద్దెల వద్ద పూజారులు ,వడ్డెలు డోలు వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ నాగులమ్మ అమ్మవారికి సంబంధించిన ఏల్పుల జెండాలను అలంకరించి,ధూపాన్ని వేసి,జలకం పూజారి మడకం లక్ష్మయ్య జలకం జల్లుతూ పూజలు నిర్వహించారు.అనంతరం ఏల్పుల జెండాలను అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గద్దె వద్ద వడ్డెలు ,ఆర్తిబిడ్డల సారకలు(డోళ్లు) తో ఆడించారు. అంతకు ముందు రోజు రాత్రి 3 గంటల సమయం లో(తెల్లవారితే బుధవారం) మండే మెలుగు కార్యక్రమాన్ని పూజారులు వడ్డెలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యం లో నిర్వహించగా,పూజారులు ,వడ్డెలు బాడిశ నాగరమేష్,మడకం లక్ష్మయ్య,సోడి సత్యం ,మూయబోయిన శివ,కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క,కోర్స శ్రీకాంత్,చౌలం భవానీ,కట్టం సమ్మక్క,తుర్స చిన్నాబ్బాయి,సోడి శ్రీను,ఇర్ప రామకృష్ణ,కొమరం ధనలక్ష్మి,కొమరం పాపరావు,ఆదివాసీ కుల పెద్దలు కుర్సం విష్ణు మూర్తి,మడకం రాజేశ్వర్ రావు,కోర్స ముసలయ్య,కారం సాంబయ్య,మడకం రమేష్,కుర్సం నరేష్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !