మన్యం న్యూస్ చర్ల:
పక్షవాతం సోకి బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ కావడంతో మాట పడిపోయి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని నిరుపేద బాధితురాలికి మానవత్వం చాటి ఆర్థిక వితరణ అందజేసిన జాతీయ మాల మహానాడు నాయకులు పలువురికి ఆదర్శమని డిప్యూటీ తహసిల్దార్ బీరవెల్లి భరణి బాబు అన్నారు. మండల పరిధిలోని లింగాపురం గ్రామానికి చెందిన కొంగూరి పద్మకు ఐ బీపీ కారణంగా ఇటీవల బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయ్యి మాట పడిపోవడంతో పలు నగరాలలో చికిత్స చేయించవలసిన పరిస్థితులలో లక్షలాది రూపాయలు అవసరమైన నేపథ్యంలో,నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది.ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మండలంలోని జాతీయ మాల మహానాడు నాయకులు మానవతా హృదయంతో స్పందించి మాల మహానాడు గ్రూపులో ప్రచారం చేయడంతో మాల మహానాడు దాతలు తమకు తోచిన విధంగాఆర్థిక సహాయం అందించారు.అట్టి సహాయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేయడానికి మండల కేంద్రంలోని చర్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో 15,500 రూపాయలను బాధితురాలు భర్త అయిన కొంగురు రాముకు డిప్యూటీ తహసిల్దార్ బీరవెల్లి భరణి బాబు,మేమున్నాం సహాయ కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ భరణి బాబు మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధిత కుటుంబానికి తమకు తోచిన సహాయం అందించాలనే ఉద్దేశంతో మానవత్వంతో స్పందించి మాల మహానాడు కార్యకర్తలు నాయకులు స్పందించి 15,500 రూపాయలు అందించడం అభినందనీయమని అన్నారు.మేమున్నాం సహాయ కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ మండలంలో గత కొన్ని ఏళ్లుగా అనేక ఇబ్బందులతో గురవుతున్న పేదవారికి వివిధ రూపాల్లో మేమున్నాం సహాయ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, బాధిత కుటుంబానికి తమ వంతుగా కొంత ఆర్థిక సహాయం అందజేశామని,బాధితుడికి ఆర్థిక చేయూతనందించాలనే ఆలోచనతో మండల మాల మహానాడు నాయకులు స్పందించి తమకు తోచిన మొత్తంలో ఆర్థిక సహాయం అందజేయడం హర్షనీయమని అన్నారు.మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తోటమల్ల రమణమూర్తి, మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్, మండల అధ్యక్షులు రుంజా రాజా, సీనియర్ పాత్రికేయులు దొడ్డ ప్రభుదాస్, సీనియర్ నాయకులు తోటమల్ల వరప్రసాద్, సిపిఐ ఎం.ఎల్ ప్రజాపందా జిల్లా నాయకులు కొండా చరణ్, ఇప్ప ప్రభుదాస్, ఇల్లంగి ఆశీర్వాదం, కొంగూరి సత్యనారాయణ, మేమున్నాం సహాయ కమిటీ సభ్యులు దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.