మన్యం న్యూస్ చర్ల:
ఫోన్ పోయిందా? అయితే వెంటనే పోలీసు వారికి చిన్న కంప్లైంట్ ఇవ్వండి మీ ఫోన్ క్షణాల్లో కనిపెట్టి మీకు అందజేసే నూతన విధానం పోలీసు వారు వద్ద ఉంది. వివరాలకు వెళితే.. చర్ల మండలనికి చెందిన మాద్దిబోయిన సంతోష్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుని సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ జరిపి మొబైల్ ఫోన్ ఐ ఎం ఈ ఐ నెంబర్ ద్వారా మాద్దిబోయిన సంతోష్ కి చెందిన మొబైల్ ను కనుగొని అతనికి తిరిగి అప్పగించడం జరిగిందని సిఐ రాజువర్మ తెలిపారు.ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమ మొబైల్ ఫోన్ ను సులభంగా తిరిగి పొందవచ్చునని ఈ సందర్భంగా సిఐ తెలియజేశారు.