యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు మాట్లాడాడు. ‘డీజే టిల్లు’ సినిమాను యువత లక్ష్యంగా తెరకెక్కించినట్లు తెలిపాడు. కానీ, అన్ని వర్గాల ఆడియన్స్‌కు నచ్చటంతో సర్‌ప్రైజ్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అలాంటి సినిమాకి పార్ట్-2 తీయాలనే విషయం తెలియగానే భయపడినట్లు చెప్పాడు.