దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ వ్యాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగింది. ఆ స్టాట్యూ తో వెనుక నుంచి కలిసి దిగిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుబాయ్ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం విశేషం.