తాజ్‌మహల్‌ని తేజో మహాలయ, శివాలయంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఆగ్రా కోర్టు స్వీకరించింది. ఈ కేసును ఏప్రిల్ 9న విచారించనున్నట్టు తెలిపింది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో.. తాజ్‌మహల్‌లో అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతుల్ని నిలిపేయాలని కోరారు. తాజ్‌మహల్ కన్నా ముందు ఇక్కడ తేజో మహాలయ శివాలయం ఉందని పలు హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.